Ind vs Pak 2025: ఆసియా కప్ లో టీమ్ ఇండియా చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్థాన్ కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై వేటు వేసేందుకు పీసీబీ సిద్దమైనట్లు సమాచారం. అతని స్థానంలో ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించాలని పాక్ క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ లో పాక్ కెప్టెన్ అలీ ఆఘా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అతడు ఏడు మ్యాచ్‌ల్లో సగటున 12 పరుగుల చొప్పున కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ గా కూడా అతడి నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా టీమ్ ఇండియాతో ఆడిన మ్యాచుల్లో అతడి డెసిషన్ ప్రశ్నార్థకంగా మారాయి. ముఖ్యంగా పాక్ మాజీ క్రికెటర్లు, అక్కడి క్రికెట్ లవర్స్ సల్మాన్ ను తప్పుబట్టారు. అంతేకాకుండా అతడి ప్రవర్తన కూడా చాలా మందికి నచ్చలేదు. సల్మాన్ రన్నరప్ చెక్కును విసిరేయడం, పొలిటికల్ వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలు పీసీబీని అసంతృప్తికి గురిచేశాయి. దీంతో వచ్చే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టు సారథ్య బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ టీ20 కెప్టెన్సీని అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం భుజానికి ట్రీట్మెంట్ చేయించుకున్న షాదాబ్ కోలుకున్న తర్వాత బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. అతడికి ఇంటర్నేషనల్ టీ20లతోపాటు ఫ్రాంచైజీ లీగ్‌లలోనూ కెప్టెన్సీ చేసిన అవకాశం ఉంది. దీనిపై పీసీబీ త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో పాక్ క్రికెట్ జట్టుకు మంచి రాబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Ind vs Aus 2025 -టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోకో రీఎంట్రీ వాయిదా?
ఈ ఏడాది ఆసియా కప్‌లో టీమ్ ఇండియా చేతిలో మూడు సార్లు ఓడిపోయింది పాకిస్థాన్. లీగ్ దశలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ లోనూ, సూపర్-4 దశలో సెప్టెంబర్ 21న జరిగిన మ్యాచ్ లోనూ, సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్‌లోనూ భారత్ చేతిలో దాయాది జట్టు ఓటమి పాలైంది. ఈ వరుస పరాజయాలు పాక్ కెప్టెన్సీ మార్పునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫైనల్లో మన తెలుగోడు తిలక్ వర్మ 69 పరుగులు చేసి భారత్ జట్టును గెలిపించాడు.


