క్రీడలతోనే మానసిక ఉల్లాసమని క్రీడలు ఆడడంతో ఆరోగ్యంగా ఉంటారని సంగారెడ్డి రూరల్ సిఐ పి. అశోక్ కుమార్ అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పొన్న శంకర్ రెడ్డి సహకారంతో కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి నేతృత్వంలో పోతిరెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రీకెట్ టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభించారు. కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి ప్రారంభోత్సవానికి వచ్చిన సీఐను శాలువతో సన్మానించారు.
సీఐ పి అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చని, మానసిక ఒత్తిళ్లకు దూరం కావచ్చని ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. నైపుణ్యత పెంపొందించేందుకు ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించేందుకు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డిని సిఐ అభినందించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ క్రీడలు గత నాలుగు సీజన్లు నిర్వహిస్తున్నామని క్రీడాకారులను దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా క్రికెట్ క్రీడలను నిర్వహించేందుకు పొన్న శంకర్ రెడ్డి సహకారంతో క్రికెట్ క్రీడలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రికెట్ క్రీడలు 5 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో 32 జట్లు తలపడనున్నాయని మొదటిది బహుమతి రూ. లక్ష రూపాయల నగదు , రెండో బహుమతి రూ.50 రూపాయల మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతులు కూడా ఉంటాయని క్రికెట్ టోర్నమెంట్ ఈనెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఈ క్రికెట్ క్రీడలకు సంబంధించిన ప్రేక్షకులు వీక్షించేదుకు ప్రత్యేక యూట్యూబ్ లైవ్ ద్వారా క్రికెట్ క్రీడలను ప్రేక్షకులకు అందిస్తున్నామని, క్రికెట్ క్రీడలను చూడడానికి వచ్చిన ప్రేక్షకుల కోసం త్రాగునీరు, టెంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, పి ఆర్ ఆర్ ఆర్గనైజేషన్ కిష్టారెడ్డి, మురళీధర్ రెడ్డి, పిఆర్ పల్లి యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.