IPL: ఈ ఏడాది ఐపీల్ సీజన్ ముగిసిన తరువాత రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో సంజు శాంసన్ కి తీవ్ర విభేదాలు వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. జట్టు కెప్టెన్‌గా రాణించిన సంజు, తాజాగా తనను జట్టులో నుండి ట్రేడ్ చేయాలని లేదా విడుదల చేయాలని అధికారికంగా అభ్యర్థించినట్టు పలు వార్తా సంస్థలు తెలిపాయి. ఇదే సమయంలో సంజుని తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 సీజన్ లో ఫ్రాంఛైజీ అతడిని రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. సీజన్ ప్రారంభ మ్యాచ్‌లలో సంజు శాంసన్ కెప్టెన్సీ వహించలేదు. గతంలో మాదిరిగా సంజు, ఫ్రాంఛైజీతో సన్నిహితంగా ఉండటం లేదని కొంతమంది క్రికెటర్లు చెబుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Read more: https://teluguprabha.net/sports-news/rp-singh-advises-bcci-to-follow-workload-management/
టీం నుండి జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్ వంటి కీలక ఆటగాళ్లను ఫ్రాంచైజీ విడుదల చేయడం సంజు శాంసన్‌ను తీవ్రంగా నిరాశకు గురి చేసినట్లు సమాచారం. ముఖ్యమైన ఆటగాళ్లు లేకుండా జట్టు స్థిరత్వాన్ని కోల్పోయిందని ఆయన భావించారని అతని సన్నిహితులు అంటున్నారు. జట్టులో కీలక సభ్యులపై ఈ విధంగా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు యాజమాన్యం మీద అతని విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
Read more: https://teluguprabha.net/sports-news/brendan-taylor-longest-test-cricket-record/
ఒక మ్యాచ్ అనంతరం సంజు మరియు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మధ్య దూరం కనిపించడంతో రిఫ్ట్ ప్రచారం జోరందుకుంది. అయితే ద్రావిడ్ స్వయంగా ఈ ప్రచారాలను అవాస్తవాలు అని తిప్పికొట్టారు.


