Thursday, April 3, 2025
HomeఆటTeam India: భారత్‌లో సౌతాఫ్రికా, విండీస్ పర్యటనల షెడ్యూల్‌ ప్రకటన

Team India: భారత్‌లో సౌతాఫ్రికా, విండీస్ పర్యటనల షెడ్యూల్‌ ప్రకటన

ప్రస్తుతం టీమిండియా(Team India) క్రికెటర్లు ఐపీఎల్‌ టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరో 50 రోజుల పాటు ఈ టోర్నీలో మ్యాచ్‌లు ఆడనున్నారు. అనంతరం జూన్‌ నెలలో ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నారు. ఇక అక్టోబర్‌ నెలలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో రెండు టెస్టులు ఆడేందుకు రానుంది. ఈమేరకు బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్‌ 2-6 మధ్య తొలి టెస్టు.. అక్టోబర్ 10-14 మధ్య రెండో టెస్టు నిర్వహించనున్నట్లు తెలిపింది.

- Advertisement -

ఇదిలా ఉంటే సౌతాఫ్రికా జట్టు కూడా నవంబర్‌లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14-18 మధ్య తొలి టెస్టు.. నవంబర్ 22-26 మధ్య రెండో టెస్టు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 30న తొలి వన్డే మ్యాచ్, డిసెంబర్ 3న రెండో వన్డే, డిసెంబర్ 6న మూడో వన్డే జరగనుంది. ఇక డిసెంబర్ 9, 11, 14, 17, 19న టీ20లు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News