Sunday, March 23, 2025
Homeఆటకోహ్లీని పొగిడిన షారక్.. రోహిత్ అభిమానులు ఫైర్.. ఎంత పెద్ద మాట అన్నాడు సార్..!

కోహ్లీని పొగిడిన షారక్.. రోహిత్ అభిమానులు ఫైర్.. ఎంత పెద్ద మాట అన్నాడు సార్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) ఘనంగా ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్ వేదికగా ఐపీఎల్ 18వ సీజన్ మొదలైంది. తొలి మ్యాచ్‌లో కేకేఆర్, ఆర్సీబీ తలపడనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకలకు కేకేఆర్ ఓనర్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంలో షారుఖ్ ఖాన్ విరాట్ కోహ్లీని పొగడటం.. రోహిత్ శర్మ అభిమానులను కోపం తెప్పించాడు.

- Advertisement -

ఆరంభ వేడుకల్లో భాగంగా షారుఖ్ ఖాన్ కోహ్లీని వేదిక మీదకు ఆహ్వానించాడు. IPL ప్రారంభమై 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. కోహ్లీ మాత్రమే ఒక జట్టుకు ఆడుతున్నాడని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రత్యేక జ్ఞాపికను అందించారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ఈ జనరేషన్ క్రికెటర్లలో ‘వన్ అండ్ ఓన్లీ గోట్ కోహ్లీ’ అన్నాడు. ఈ మాటలు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు నచ్చలేదు.

నిజానికి కోహ్లీ, రోహిత్ శర్మ ఒకే జనరేషన్ ఆటగాళ్లు. ఈ జనరేషన్‌లో వన్ అండ్ ఓన్లీ గోట్ ప్లేయర్ కోహ్లీ అంటే రోహిత్ శర్మను తక్కువ చేయడమేనని అతడి అభిమానులు అంటున్నారు. ఈ జనరేషన్ క్రికెటర్లలో వన్ ఆఫ్ ది గోట్ ప్లేయర్ కోహ్లీ అన్నా సరి అని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ చాంపియన్‌గా.. టీమిండియా టి20 ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. ఈ విషయం షారుఖ్ మర్చిపోయాడా అంటూ అభిమానులు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News