Shepherd: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ రొమారియో షెఫర్డ్ (Romario Shepherd) కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు. గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. సెయింట్ లూసియా జట్టుతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఈ ఆల్ రౌండర్ ఒక్క బంతికే 20 పరుగులు రాబట్టాడు. దీంతో, షెఫర్డ్ కు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారింది.
Read Also: MK Stalin: ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడే ధైర్యం ఉందా? స్టాలిన్ కు బీజేపీ సవాల్
ఎలా సాధ్యమైందంటే?
అయితే, షెఫర్డ్ ఒక్క బాల్ లో 20 పరుగులు రాబట్టడం విశేషంగా మారింది. అయితే,అదెలా సాధ్యమైందంటే..? 15వ ఓవర్‌లో బౌలర్ థామస్ వేసిన మూడో బంతి నోబాల్ అయింది. అయితే.. ఈ బంతికి షెఫర్డ్ పరుగులేమీ చేయలేదు. ఫ్రీహిట్‌ను షెఫర్డ్ భారీ సిక్స్‌గా మలిచాడు. అయితే.. అది కూడా నోబాలే. దీంతో ఆ తర్వాతి బంతినీ బ్యాటర్ బౌండరీ లైన్ ఆవలకు తరలించాడు. ఇక్కడ దురదృష్టం మరోసారి బౌలర్‌ని వెంటాడింది. అది కూడా నోబాల్‌గా తేలింది. దీంతో మూడో ఫ్రీహిట్‌నూ షెఫర్డ్ ఉపయోగించుకుని.. సునాయాసంగా సిక్స్‌గా మలిచాడు. దీంతో ఒక్క లీగల్ డెలివరీకి మొత్తం 20 పరుగులు వచ్చినట్లైంది. ఇలా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షెఫర్డ్ 34 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్స్‌లు ఉన్నాయి.
Shepherd showing no mercy at the crease! 🔥
Five huge sixes to start the charge! 💪#CPL25 #CricketPlayedLouder
#BiggestPartyInSport #SLKvGAW #iflycaribbean pic.twitter.com/6cEZfHdotd— CPL T20 (@CPL) August 27, 2025
ఆర్సీబీ తరఫున..
ఇక రోమారియో షెఫర్డ్ గత ఐపీఎల్ (IPL)లో ఆర్సీబీ (Royal Challengers Bengaluru) తరఫున అదరగొట్టాడు. చెన్నైతో జరిగిన ఓ మ్యాచ్‌లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇది. యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
Read Also: R Ashwin: కొత్తదానికి ఆరంభం.. ఐపీఎల్ కు స్టార్ స్పిన్నర్ అశ్విన్ గుడ్ బై


