Shreyas Iyer Injury Update: భారత పురుషుల జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రి పాలయ్యారు. ఆసీస్ తో జరిగిన మూడో వన్డేలో పక్కటెముకల గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో అయ్యర్ ను సిడ్నీలోని హాస్పటిల్ లో చేర్చాడు. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నట్లు తెలుస్తోంది.
సిడ్నీ వన్డేలో ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కారీ కొట్టిన బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ నుండి వెనుకకు పరిగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ ను అందుకుని అతనిని పెవిలియన్ కు పంపాడు అయ్యర్. ఈ క్రమంలో ఎడమ పక్కటెముకకు గాయం కావడంతో అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే టీమ్ డాక్టర్, ఫిజియో ఎలాంటి అవకాశం తీసుకోకుండా అతడిని ఆస్పత్రిలో చేర్చాడు.
అందుతున్న సమాచారం ప్రకారం, శ్రేయస్ గత రెండు రోజులగా ఐసీయూలో ఉండటంతోపాటు అతడికి రక్తస్రావం అయినట్లు వైద్యులు గుర్తించారు. వారం రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలోనే అయ్యర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రేయస్ కోలుకోవడానికి మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. అతడు త్వరగా కోలుకోవాలని అయ్యర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: IND-W vs BAN-W- వర్షం కారణంగా భారత్-బంగ్లా మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్..
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా రెండో వన్డేలో మాత్రం సత్తా చాటాడు. రోహిత్ తో కలిసి మంచి పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ఆ మ్యాచ్ లో 77 బంతుల్లో 61 పరుగులు చేసి టీమ్ ఇండియా భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక మూడో వన్డేలో గాయం కారణంగా హాస్పిటల్ పాలవ్వడంతో బ్యాటింగ్ ఆడే ఛాన్స్ రాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భారత్ జట్టు 2-1తో సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే.


