Indian team for Asia Cup 2025: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్ లో ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ఈఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ లో తన సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు. బ్యాటర్ గా, కెప్టెన్ గా తనదైన ముద్రవేశాడు. దీంతో బీసీసీఐ త్వరలో జరగబోయే ఆసియా కప్ కు రెడ్ కార్పెట్ వేసి మరీ అతడిని జట్టులోకి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌లకు కూడా అతన్ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్, దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయాస్ అయ్యర్ తనపై జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఐదు వన్డేల్లో 243 పరుగులు చేశాడు. అంతేకాకుండా స్థిరత్వానికి మారుపేరుగా నిలిచాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ లోనూ నాయకుడిగా, బ్యాటర్ గా జట్టును ఫైనల్ కు తీసుకెళ్లిన విధానం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది.
గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కప్ అందించాడు. అయితే కొన్ని కారణాల వల్ల కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఆంక్షన్ లో అతడిని వదిలేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ భారీ ధరకు అయ్యర్ ను కొనుగోలు చేసింది. అయితే పంజాబ్ తనపై పెట్టిన నమ్మకాన్ని దాదాపు సుసాధ్యం చేశాడు శ్రేయస్. కెప్టెన్ గా టీమ్ ను పైనల్ కు తీసుకెళ్లడమే కాకుండా..బ్యాటర్ గానూ పరుగుల వరద పారించాడు. మెుత్తంగా 604 పరుగులు చేశాడు.
Also Read: Shubman Gill-శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత.. ఏకంగా నాలుగోసారి ఆ ఐసీసీ అవార్డుకు ఎంపిక!
ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించడం, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు తీసుకెళ్లడం వల్ల అతడిని ఇంగ్లాండ్ టూర్ కు ఎంపిక చేస్తారని భావించారు. కానీ బీసీసీఐ అతడిని పక్కన పెట్టేసింది. 2026లో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో.. టీమిండియా మంచి జట్టును రెడీ చేసే పనిలో పడింది. అందులో భాగంగానే అయ్యర్ ను జట్టులోకి తీసుకోవాలని కోచ్ గంబీర్ తోపాటు సెలక్టర్లు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Test Rankings – ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన సిరాజ్ మియా.. జైస్వాల్, జడేజా కూడా!


