Saturday, November 15, 2025
HomeఆటODI captain: వన్డే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్.. ?

ODI captain: వన్డే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్.. ?

ODI captain: ఆసియా కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టుని ప్రకటించింది. అయితే ఈ టీ20 సిరీస్ స్క్వాడ్ లో స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. మంచి ఫాంలో ఉన్నప్పటికీ శ్రేయస్ కు చోటు దక్కకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ గా మారింది. శ్రేయస్ కు వన్డే పగ్గాలు ఇస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ గా నియమిద్దామని అనుకుంటోన్న మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత టెస్టు కెప్టెన్ గా శుభ్‌మన్‌ గిల్ ఉన్నాడు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్.. వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గిల్‌ను పొట్టి ఫార్మాట్‌కు వైస్‌ కెప్టెన్‌గా చేయడంతో భవిష్యత్తులో అతడికే సారథ్యం అప్పగిస్తారని ఖరారు అయిపోయింది. ఇక రోహిత్ శర్మ వచ్చే వన్డే ప్రపంచ కప్‌ వరకూ ఆడాలనే లక్ష్యంతో ఉన్నాడు. అయితే, రోహిత్‌ను వన్డే సారథ్యం నుంచి తప్పించి శ్రేయస్‌ను వరల్డ్ కప్‌ 2027 వరకూ నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ తర్వాత కూడా గిల్‌ను ఏకైక సారథిగా చేయకపోవచ్చని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -

Read Also: Anasuya: ఫ్లర్ట్ విట్ లైట్స్.. వైరల్ గా మారిన అనసూయ లేటెస్ట్ పోస్ట్

వర్క్‌లోడ్‌ కారణంగా?

గతంలో మూడు ఫార్మాట్లకు ఒకే సారథిగా ఉన్నా ఎలాంటి స్ట్రెస్ ఉండేది కాదు. అప్పుడు ఇన్ని టోర్నీలు, సిరీస్‌లు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు టెస్టుల్లో ఛాంపియన్‌షిప్‌, వన్డేల్లో వరల్డ్‌ కప్‌తోపాటు ఛాంపియన్స్‌ ట్రోఫీ మళ్లీ రావడం, టీ20ల్లో వరల్డ్‌ కప్‌.. ఇలా టోర్నీలూ ఎక్కువైపోయాయి. ఇక ఆసియా కప్‌ కూడా రెండేళ్లకొకసారి జరుగుతూనే ఉంది. ఇలా క్రికెట్ క్యాలెండర్ బిజీగా మారిపోయింది. దీంతో కెప్టెన్‌పై వర్క్‌లోడ్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రోహిత్‌ శర్మకు 38 ఏళ్లు దాటాయి. వన్డే ప్రపంచకప్‌ నాటికి అతడికి 40+ అవుతాయి. గిల్‌కే బాధ్యతలు అప్పగించాలని తొలుత మేనేజ్‌మెంట్ భావించింది. కానీ, వర్క్‌లోడ్‌ కారణంగా అతడి ప్రదర్శనపై ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. దీంతో వన్డేలకు రోహిత్‌ బదులు శ్రేయస్‌ను సారథిగా నియమిస్తే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నార. ఆసియా కప్‌ తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశమై రోహిత్, విరాట్ ఫ్యూచర్ పై చర్చిస్తారని..  అంతేకాకుండా శ్రేయస్ ను కెప్టెన్ గా చేస్తారని తెలుస్తోంది.

Read Also: Reliance Jio: అవన్నీ పుకార్లే.. అందుబాటులోనే రూ.799 ప్లాన్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad