Saturday, November 15, 2025
HomeఆటShubman Gill: ఆసియా కప్ ముందు బిగ్ రిలీఫ్.. కోలుకున్న గిల్

Shubman Gill: ఆసియా కప్ ముందు బిగ్ రిలీఫ్.. కోలుకున్న గిల్

Shubman Gill: ఆసియా కప్ టోర్నమెంట్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు బిగ్ రిలీఫ్ లభించింది. యూఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుండగా.. ఆ ఈవెంట్ ముందు కీలక ప్లేయర్, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ అనారోగ్యానికి గురయ్యాడు. అయితే, కొంతకాలంగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న గిల్.. ఇప్పుడు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడు గిల్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి జట్టుతో చేరడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం మొహాలీలో ఉన్న గిల్, త్వరలోనే పూర్తిస్థాయి శిక్షణ ప్రారంభించనున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతనికి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి, అతని పూర్తి సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అతను ఆసియా కప్ కోసం భారత జట్టుతో కలవనున్నాడు. కాగా, ఇదే అనారోగ్యం కారణంగా గిల్ దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతని స్థానంలో నార్త్ జోన్ జట్టుకు అంకిత్ కుమార్ నాయకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -

Read Also: Heavy Rains: కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం.. పలుచోట్ల రహదారుల మూసివేత

ఆసియా కప్ ప్రారంభం ఎప్పట్నుంచంటే?

సెప్టెంబర్ 9వ తేదీ నుంచి యూఏఈలో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే ఆగస్టు 19న 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. టోర్నీలో భాగంగా టీమిండియా సెప్టెంబర్ 10న యూఏఈతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన వైస్ కెప్టెన్ గిల్ కోలుకోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం.

Read Also: US Tariffs: భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలు.. మోడీకి సీటీఐ లేఖ

ఆసియా కప్‌కు భారత జట్టు
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హర్షిత్‌ రాణా, రింకు సింగ్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad