Shubhman Gill Net worth: శుభమన్ గిల్ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో 8 సెప్టెంబర్ 1999న జన్మించాడు. అతని తండ్రి లఖ్వీందర్ సింగ్ గిల్.. శుభమన్‌లో ఉన్న క్రికెట్ ప్యాషన్‌ను గమనించి ప్రోత్సాహం అందించారు. శుభమన్ 8 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
2018 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు ఛాంపియన్‌షిప్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లోనూ అతని కీలక ఇన్నింగ్స్‌తో భారత జట్టు కప్పు గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ తర్వాతే అతని మీద అందరి దృష్టి పడింది.
Read more: https://teluguprabha.net/sports-news/mohammed-siraj-oval-win-breakup-story/
ఈ 25 ఏళ్ల క్రికెటర్ సంపాదన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! ఈ యువ క్రికెటర్ బీసీసీఐ నుంచి కోట్లలో జీతం, ఐపీఎల్, బ్రాండ్ డీల్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. 2018 లో కేకేఆర్ తరపున ఐపీఎల్ లో శుభ్‌మన్ గిల్ అడుగుపెట్టాడు. 2018 నుండి 2021 వరకు ప్రతి సీజన్ కి రూ.1.18 కోట్లు తీసుకున్నాడు. 2022 నుండి 2024 ఐపీఎల్ సీజన్ లలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడినందుకు రూ.8 కోట్లు అందుకున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్ కి గాను గుజరాత్ టైటాన్స్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించి రూ.16.5 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ 2024-2025లో శుభ్‌మన్ గిల్ గ్రేడ్ ఏ జాబితాలో ఉన్నాడు. దీంతో గిల్‌కు బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.5 కోట్లు జీతం లభిస్తుంది. ఈ ఫార్మట్ లో గిల్ కి ఒక టెస్ట్ మ్యాచ్‌కి రూ.15 లక్షలు, ఒక వన్డే మ్యాచ్‌కి రూ.6 లక్షలు, ఒక టీ20 మ్యాచ్‌కి రూ.3 లక్షలు లభిస్తుంది.
ఒక నివేదిక ప్రకారం గిల్ ఆస్థి 2024 వరకు సుమారు రూ.30-40 కోట్లు వరకు ఉండవచ్చు. గిల్ కి లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. అతని వద్ద మెర్సిడెస్ బెంజ్ ఇ350, రేంజ్ రోవర్ ఎస్‌యూవీ, మహీంద్రా థార్ ఉన్నాయి. ప్రస్తుతం గిల్ ప్రముఖ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నాడు. పూమా, జిల్లెట్, మై11సర్కిల్, బోట్, వివో, సీట్(CEAT) వంటి బ్రాండ్స్ ద్వారా సంవత్సరానికి రూ.6 కోట్లు ఆర్జిస్తున్నాడని అంచనా. రానున్న కాలంలో టెస్ట్ క్యాప్టెన్ గా గిల్ ఎంపిక అయితే అతని ఆదాయం మరింత పెరగవచ్చు.


