సిద్ధిపేట్ లో జరిగిన 37వ నేషనల్ షోటోఖాన్ కరాటే టి.హెబ్ ఆర్ కప్ 2023 పోటీలలో భాగంగా వెపన్ కటా, కటా నిర్వహించారు. ఈ పోటీలలో దాదాపుగా 6 రాష్ట్రాల నుండి 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో రామడుగు మండలం గుండిగోపాల్రావుపేట లోని అక్షర పాఠశాలకు చెందిన కరాటే పోటీలలో విజేతలుగా నిలిచి ప్రతిభ కనబరిచారు. వెపన్ కటా (నాన్బాక్) అండర్ 14 విభాగంలో P. లాస్య, P. శివచరణ్ లు గోల్డ్ మెడల్స్ సాధించారు. హర్షిత, L. శ్రీమాన్ జ, V. వివేక్, హర్షవర్ధనలు సిల్వర్. మోడల్స్ కటా లండర్ 14 విభాగంలో G. వెన్నెల, T. సాత్యక శివకుమార్, శశివర్ధన్, సౌమ్య వీరు గోల్డ్ మెడల్స్ P. నవ్య, సంతోష్ శివబిందు, వర్షిత్, సిల్వర్ మెడల్స్ . స్నేహిక మల్లికార్జున్లు బ్రాంజ్ మెడల్స్ సాధించారు.. ఈ క్రీడకు కరాటే) న్యాయనిర్ణేతగా రాపోలు సుదర్శన్ చీప్ జడ్జిగా వ్యవహరించారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు జనవరి 24 నుండి 28 వరకు గోవాలో జరిగే జపనీస్ ట్రైనింగ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ పోటీలకు అర్హత సాధించారు. గెలుపొందిన విజేతలు ఎస్సై తోట తిరుపతి చేతుల మీదుగా ట్రోఫీలను బహుకరణ మెడల్స్ అందించారు. అనంతరం విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మినుకుల మునీందర్ అడ్మినిస్ట్రేషన్ రాధ జపాన్ కరాటే అసోసియేషన్ కరీంనగర్ మాస్టర్ సుంకె ఉపాధ్యాయ బృందం అభినందించారు.