Commonwealth Games: భారత జావెలిన్ త్రో స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో నిరాశ ఎదురైంది. స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన అతడికి ఆ పతకం దక్కలేదు. ఆఖరిదాకా పోరాడినప్పటికీ నీరజ్‌కు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
శ్రీలంక అథ్లెట్‌కు స్వర్ణం: ఈ పోటీల్లో నీరజ్ తన ఉత్తమ ప్రదర్శనగా 85.83 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరగలగాడు. మరోవైపు శ్రీలంక అథ్లెట్ రమేశ్ పతిరగె 89.75 మీటర్ల త్రో విసిరాడు. దీంతో అతడికి స్వర్ణ పతకం దక్కింది. ఇక ఇదే ఈవెంట్లో భారత్‌కే చెందిన మరో అథ్లెట్ యశ్వీర్ సింగ్ 85.41 మీటర్ల త్రోతో కాంస్య పతాకాన్ని సొంతం చేసుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో నీరజ్‌కు ఇది రెండో పతకం కావడం విశేషం. గతంలో 2018 గోల్డ్‌కోస్ట్ క్రీడల్లో స్వర్గం సాధించిన ఆయన, 2022 క్రీడలకు గాయం కారణంగా దూరమయ్యారు. తాజాగా గ్లాస్గో వేదికగా జరిగిన ఈ టోర్నీలో రజతంతో మెరిశారు.
Also Read-Hockey : కాషాయ కాంతుల్లో హాకీ కదనరంగం.. జెర్సీ వర్ణం మార్పుపై తీవ్ర వివాదం..

