టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో కేవలం 70 బంతుల్లోనే ఆమె శతకం సాధించారు. అంతకుముందు ఈ రికార్డు హర్మన్ ప్రీత్ సింగ్ (87 బంతులు) పేరిట ఉండేది. ఈ మ్యాచులో ఆమె 80 బంతుల్లో 7 సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేసింది. కాగా వన్డేల్లో స్మృతికి ఇది పదో సెంచరీ కావడం విశేషం.
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – 15 సెంచరీలు
సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 13 సెంచరీలు
టామీ బ్యూమాంట్ (ఇంగ్లాండ్)- 10 సెంచరీలు
స్మృతి మంధాన (భారత్) – 10 సెంచరీలు
చమరి ఆటపట్టు (శ్రీలంక) – 9 సెంచరీలు
షార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లాండ్) – 9 సెంచరీలు
నాట్ స్కివర్-బ్రంట్ (ఇంగ్లాండ్) – 9 సెంచరీలు