Smriti Mandhana Fastest Century: వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సులతో శతకం సాధించింది. దీంతో అత్యంత తక్కువ బంతుల్లోనే శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా ఘనత సాధించింది. ఓవరాల్‌గా రెండో బ్యాట్స్ ఉమెన్‌గా చరిత్ర సృష్టించింది. ఆసీస్ మాజీ సారథి మేగ్ లానింగ్ 45 బంతుల్లో సెంచరీతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఆస్ట్రేలియాపై 413 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టును ధనాధన్ బ్యాటింగ్‌తో ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌లు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ముఖ్యంగా భారీ షాట్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ.. మంధాన ఫాస్టెస్ట్ సెంచరీ సాధించింది. తద్వారా అజారుద్దీన్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాల రికార్డును బ్రేక్ చేసింది ఈ బ్యాట్స్ ఉమెన్.
Also Read: https://teluguprabha.net/sports-news/india-win-against-oman-in-asia-cup-thriller-match/
భారత్ తరఫున ఫాస్టెస్ట్ వన్డే సెంచరీలు..
స్మృతి మంధాన – 50 బంతులు
విరాట్ కోహ్లీ – 52 బంతులు
వీరేంద్ర సెహ్వాగ్ – 60 బంతులు
విరాట్ కోహ్లీ – 61 బంతులు
మహమ్మద్ అజారుద్దీన్ – 62 బంతులు
కేఎల్ రాహుల్ – 62 బంతులు


