Smriti Mandhana: భారత మహిళా జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. తనదైన ఆటతీరుతో మరోసారి ప్రపంచ నంబర్ వన్ వన్డే బ్యాట్స్‌మన్‌గా నిలిచింది. గతంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న మంధాన తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాణించించింది. ఈ మ్యాచ్‌లో 58 బంతుల్లో 63 పరుగులు చేసింది. 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 7 అదనపు రేటింగ్ పాయింట్లను సాధించింది. తద్వారా తన పాయింట్ల సంఖ్యను 735కు పెంచుకుని మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్‌ను కిందకు దించి, కెరీర్‌లో నాలుగో సారి అగ్రపీఠాన్ని అధిరోహించింది. 2019లో తొలిసారి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్న మంధాన.. ఈ ఏడాది జూన్, జులైల్లో కూడా స్వల్ప కాలం నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా కొనసాగింది. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉన్న మంధానకు రెండో స్థానంలో ఉన్న బ్రంట్‌కు కేవలం నాలుగు రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. కాగా, ఈ వారం ఆసీస్‌తో జరగబోయే మరో రెండు వన్డేల్లో మంధాన ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపర్చుకుని అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. వరల్డ్ కప్‌కు కొద్ది రోజుల ముందే మంధాన టాప్ ప్లేస్‌లోకి చేరడం విశేషంగా చెప్పవచ్చు. ఈ నెలాఖరు అనగా సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంకల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకడం భారత జట్టుకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.
వరల్డ్ కప్‌కు ముందే అరుదైన ఘనత..
తాజా ర్యాంకింగ్స్‌లో మంధనతో పాటు మరో ఇద్దరు భారత బ్యాటర్లు కూడా తమ ర్యాంకింగ్స్‌ను పెంచుకున్నారు. ప్రతీక రావల్ మెరుగైన ఆటతీరుతో నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 42వ స్థానానికి.. హర్లీన్ డియోల్ 5 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకారు. మిగతా భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ 12వ స్ధానంలో.. జెమీమా రోడిగ్రెజ్ 15 స్థానంలో, దీప్తి శర్మ 24వ స్థానంలో, రిచా ఘోష్ 37 స్థానంలో ఉన్నారు. ఇక, బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. భారత స్పిన్నర్ స్నేహ్ రాణా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి ఎగబాకింది. మరో భారత బౌలర్ దీప్తి శర్మ తన పేలవమైన ప్రదర్శనతో 3 స్థానాలు దిగజారి 7వ ర్యాంక్‌ను పడిపోయింది. మిగతా భారత బౌలర్లలో రేణక సింగ్ ఠాకూర్ 26, క్రాంతి గౌడ్ 62, అరుంధతి రెడ్డి 65, పూజా వస్త్రాకర్ 77, శ్రీ చరణి 83, ప్రియా మిశ్రా 85, టైటాస్ సాధు 91, సైమా ఠాకోర్ 96 స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్‌నర్ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోగా.. హేలీ మాథ్యూస్, మారిజన్ కాప్ టాప్-3లో ఉన్నారు. ఇక, ప్రస్తుత భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 4వ స్థానంలో కొనసాగుతోంది.


