భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) కుమార్తె సనా గంగూలీకి(Sana Ganguly) తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కోల్‌కతా నుంచి రాయ్‌చక్ వెళ్తున్న బస్సు.. బెహలా చౌరస్తాలో సనా కారును వెనక నుంచి ఢీకొట్టింది. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
- Advertisement -
ప్రమాదం సమయంలో సనా.. డ్రైవర్ పక్క సీట్లో కూర్చొని ఉన్నారు. అయితే బస్సు డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా బస్సును వెంబడించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సనా కారు స్వల్పంగా ధ్వంసం కాగా.. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.