Thursday, November 7, 2024
HomeఆటIND vs SA T20: భారత్‌తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?

IND vs SA T20: భారత్‌తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?

IND vs SA T20: స్వదేశంలో టీమిండియాతో జరిగే టి20 సిరీస్ కోసం సౌతాఫ్రికా టీమ్ తన జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన ఈ జట్టుకు ఎయిడెన్ మార్క్రెమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు క్లాసెన్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, కేశవ్ మహారాజ్ కూడా ఉన్నారు. దీంతో భారత జట్టుకు హోరాహోరీ పోటీ తప్పదు. అయితే టీ20 జట్టులో సీనియర్ బౌలర్లు ఎన్రిక్ నోర్కియా, తబ్రేజ్ షమ్సీకి చోటు దక్కలేదు. నవంబర్ 8 నుంచి నాలుగు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తాడు.

- Advertisement -

సిరీస్ షెడ్యూల్..

నవంబర్ 08 (శుక్రవారం): 1వ T20I, డర్బన్ (5 PM)
నవంబర్ 10 (ఆదివారం): 2వ T20I, గ్కెబెర్హా (4 PM)
నవంబర్ 13 (బుధవారం): 3వ T20I, సెంచూరియన్ (5 PM)
15 నవంబర్ 15 (శుక్రవారం): 4వ T20I, జోహన్నెస్‌బర్గ్ (5 PM)

దక్షిణాఫ్రికా జట్టు: మార్క్రమ్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మార్కో జెన్‌సన్, రీజా హెండ్రిక్స్, డోనోవన్ ఫెరీరా, ఒటోనిల్ బార్ట్‌మన్, ర్యాన్ రికిల్టన్, ఆండిలే సిమెలన్, లూథో సిపమాల, ట్రిస్టన్ స్టబ్స్, మిహాలీ మాపోగ్వానా, కెస్. హెన్రిచ్ క్లాసెన్, నక్బా పీటర్, పాట్రిక్ క్రుగర్, గెరాల్డ్ కోయెట్జీ.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌‌‌‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (కీపర్‌‌‌‌‌‌‌‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌‌‌‌ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌‌‌‌దీప్ సింగ్, విజయ్‌‌‌‌కుమార్ వైశాక్, అవేష్ ఖాన్ , యష్ దయాల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News