ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించగా… తాజాగా దక్షిణాఫ్రికా(South Africa) కూడా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా చాలా కాలంగా టెస్టు జట్టుకు దూరమైన లుంగి ఎంగిడి తిరిగి టీమ్‌లో చేరాడు. ఇక జట్టు పరంగా చూస్తే బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో సమతుకంగా కనిపిస్తోంది.
దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో యన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, సెనురన్ ముత్తుసామీ, డేన్ పాటర్సన్