Sunday, December 8, 2024
HomeఆటSA vs IND: భారత్-సౌతాఫ్రికా రెండో టీ20 టైమింగ్స్ మార్పు

SA vs IND: భారత్-సౌతాఫ్రికా రెండో టీ20 టైమింగ్స్ మార్పు

SA vs IND| భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. అయితే మ్యాచ్ టైమింగ్స్ మారుస్తూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. సెయింట్ జార్జ్ పార్క్, గ్క్వెబర్హాలో జరగనున్న ఈ మ్యాచ్ ప్రారంభ మ్యాచ్ సమయాన్ని ఓ గంట ముందుకు జరిపారు. దీంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 7 గంటలకు టాస్ వేయనున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉందని తెలుస్తోంది. కాగా తొలి టీ20 మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

- Advertisement -

తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా ఆడి 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విధితమే. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 202 పరుగులు చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. దాంతో వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ జట్టు కేవలం 141 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్‌లో 1-0తో టీమిండియా లీడ్‌లో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News