పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో సౌతాఫ్రికా(South Africa) ఆటగాడు ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా (NZ vs SA) మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కే (Matthew Breetzke) అరంగేట్రం చేశాడు. అయితే తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. సెంచరీ తర్వాత కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 150 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వన్డేల్లో డెబ్యూ మ్యాచ్‌లోనే 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
అంతకుముందు వన్డేల్లో అరంగేట్రంలో అత్యధిక స్కోరు చేసిన రికార్డు వెస్టిండీస్ ఆటగాడు డెస్మండ్ హేన్స్ (148 పరుగులు) పేరిట ఉండేది. దాదాపు 47 సంవత్సరాల తర్వాత ఈ రికార్డును బ్రీట్జ్‌కే బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో బ్రీట్జ్‌కే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.
వన్డేల్లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే.
మాథ్యూ బ్రీట్జ్‌కే (సౌతాఫ్రికా)- 150: 2025 (న్యూజిలాండ్‌పై)
డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్)-148: 1978 (ఆస్ట్రేలియాపై)
రెహ్మనుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్)-127: 2021 (ఐర్లాండ్‌పై)
మార్క్ చాప్‌మన్ (హాంకాంగ్)-124*: 2015 (యూఏఈపై)
కోలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా)-124: 2010 (జింబాబ్వేపై)