రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో పాఠశాల స్థాయిలో విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని.. వారిలో ఉన్న క్రీడా ప్రతిభకు వేదిక అందించాలని 7H Sports సంస్థ వ్యవస్థాపకులు వెంకటేష్ అధ్వర్యంలో ‘సమ్మర్ స్పోర్ట్స్ మీట్ ‘ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సమ్మర్ క్యాంప్ లో బాడ్మింటన్, క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్, టేబుల్ టెన్నిస్ మొత్తం 5 క్రీడలలో 10 ఏండ్ల వయస్సు నుండి 17 ఏండ్ల వయస్సులోపు వారు ఎవరైనా ఆయా క్రీడలలో పాల్గొనేలా ఈ టోర్నమెంట్ ని ఏప్రిల్, మే, జూన్ లలో నిర్వహించబోతున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ టోర్నమెంట్ పోస్టర్లను విడుదల చేశారు. విద్యార్థులు చదువులతో సంవత్సరం పాటు ఒత్తిళ్లలో ఉన్న విద్యార్థులకు ఈ సమ్మర్ స్పోర్ట్స్ మీట్ వారికి వినోదాన్ని ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు క్రీడల్లో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి చక్కని వేదిక అవ్వడమే కాకుండా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఈ వేసవి సెలవులు క్రీడల్లో నిమగ్నమయ్యేలా పిల్లల్లో క్రీడా స్ఫూర్తి నెలకొల్పేలా ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కోశాధికారి, ఉప్పల్ ప్రాంతీయ రవాణాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.