ఐపీఎల్ 2025 సీజన్ అత్యంత కీలక దశలోకి చేరిన ఈ సమయంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో అద్భుత విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో LSG ప్లే ఆఫ్స్ ఆశలు ముగిసిపోయాయి.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. హైదరాబాద్ ముందు 206 పరుగుల భారీ లక్ష్యం ఉంది. అయితే బరిలోకి దిగినప్పటి నుంచే హైదరాబాద్ దూకుడు చూపించింది. ముఖ్యంగా యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ మ్యాచ్‌ను మార్చేశాడు. కేవలం 20 బంతుల్లోనే 59 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు జోష్ జోడించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు ఉన్నాయి.
అభిషేక్ తరువాత వికెట్ల మధ్య కాసేపు నిలకడగా ఆడిన క్లాసెన్ 47 పరుగులతో రాణించగా, ఇషాన్ కిషన్ 35, కమిందు మెండిస్ 32 పరుగులు చేశారు. దీంతో 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేజ్ చేసి సునాయాస విజయాన్ని నమోదు చేశారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. కానీ Hyderabad బౌలర్లు మిడిల్ ఓవర్లలో మళ్ళీ పుంజుకుని కీలక వికెట్లు తీసి ఎల్ఎస్‌జీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఈ ఫలితంతో లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి.