HomeఆటKavya Maran: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో కావ్య మారన్ పెళ్లి?

Kavya Maran: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో కావ్య మారన్ పెళ్లి?

Kavya Maran Marriage: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవంలో తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాయల్ ఛాలెంజస్ బెంగళూరు (RCB) తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ కొనసాగుతుంది. అయితే నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో SRH ఓనర్ కావ్య మారన్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. అదే ఆమె పెళ్లి.

- Advertisement -

డేటింగ్ రూమర్స్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవించందర్, కావ్య మారన్ లు డేటింగ్ లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీరద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కాగా తరచూ వీరిద్దరు కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లిన ఫోటోలు సైతం వైరల్ గా మారాయి. కానీ, తనపై వస్తున్న రూమర్స్ లో నిజం లేవని, కావ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఈ వార్తలను కొట్టిపారేస్తుంటాడు. ఈ నేపథ్యంలో గతేడాది వీరిద్దరు కలిసి అమెరికాకు వెకేషన్ వెళ్లిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది.

హాట్ టాపిక్ కావ్య పెళ్లి వార్తలు
దీంతో వీరిద్దరి డేటింగ్ వార్తలు ఇది మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనిరుధ్ కి మరోసారి కావ్యతో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన అతడు కాస్తా అసహనం వ్యక్తం చేశాడు. కానీ, ఈ వార్తలను మాత్రం పూర్తి స్థాయిలో ఖండించలేదు. దీంతో వీరిద్దరి పెళ్లి నిజమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభోత్సవం నేపథ్యంలో మరోసారి కావ్య మారన్-అనిరుధ్ ల పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే తాజాగా ఓ సినిమా ప్ర‌మోష‌న్‌లో అనిరుధ్ పాల్గొన్నాడు.

అనిరుధ్ అసహనం
ఈ సంద‌ర్భంగా ఓ రిపోర్ట‌ర్ త‌న పెళ్లి గురించి అడ‌గ‌గా.. అందుకు అనిరుధ్ “మళ్లీ ఇదేనా ” అని అసహనంతో సమాధానమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు.ఈ వార్తలను అత‌డు పూర్తిగా ఖండించకపోవడంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. అయితే అటు కావ్య మారన్ నుంచి కానీ, ఇటు అనిరుధ్ కుటుంబం నుంచి కానీ వీరి వివాహం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కావ్య పాప దృష్టి మొత్తం ఐపీఎల్‌-2026 సీజన్‌పైనే ఉంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. మరోవైపు అనిరుధ్‌ వరుస సినిమాలో బీజీగా ఉన్నాడు.

Also Read: Rishab Shetty: హీరోయిన్ ని అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి.. అసలేం జరుగుతుంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News