SRH vs RCB Match: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఉప్పల్ స్టేడియంలో అడుగుపెడుతుండటంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. టికెట్ల కోసం క్రికెట్ ప్రియులు ఎగబడుతున్న ఈ క్రేజ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఐపీఎల్ టికెట్లకున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని నకిలీ యాప్‌లతో పాటు మోసపూరిత వెబ్‌సైట్ల ద్వారా అభిమానుల సొమ్మును దోచుకోవడానికి సైబర్ నేరగాళ్లు తెరలేపారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ క్రికెట్ అభిమానులను అప్రమత్తం చేశారు.
సైబర్ పోలీసుల హెచ్చరికలు: సోషల్ మీడియా వేదికలుగా అసలైన బుకింగ్ యాప్‌లను తలపించేలా నకిలీ లింకులను (Fake Links) సృష్టించి కేటుగాళ్లు తిరుగుతున్నారు. ఇలాంటి అపరిచిత లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయమని సీపీ హెచ్చరించారు. మ్యాచ్ టికెట్ల కోసం కేవలం ఐపీఎల్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించిన ప్లాట్‌ఫామ్స్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఫేస్‌బుక్ గ్రూపులలో “ఐపీఎల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి” అంటూ వచ్చే నమ్మశక్యం కాని ఆఫర్లను నమ్మి అడ్వాన్స్ డబ్బులు పంపి మోసపోవద్దని పోలీసులు స్పష్టం చేశారు.

