Friday, November 22, 2024
HomeఆటSrinivas Goud: త్వరలో సీఎం కప్

Srinivas Goud: త్వరలో సీఎం కప్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని బేగంపేట్ లో ఉన్న పర్యాటక భవన్లో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల జిల్లా యువజన సర్వీసుల శాఖల అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంను క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, రాష్ట్ర క్రీడ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి నిర్వహించారు.

- Advertisement -

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో దేశంలో జరిగే అన్ని క్రీడాంశాలలో తెలంగాణ క్రీడాకారులు ఇతర రాష్ట్రాల క్రీడాకారుల కంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో పతకాలు సాధించడంలో ముందుండాలని రాష్ట్ర క్రీడా శాఖ అధికారులకు, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని లక్ష్యంతో మండల స్థాయి నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయిలో సీఎం కప్ నిర్వహిస్తామన్నారు. త్వరలో సీఎం కప్ షెడ్యూల్ ని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులను విజయవంతం చేసేలా స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలను కార్పొరేట్ కంపెనీలను భాగస్వామ్యం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రామీణ క్రీడా ప్రాంగణాలను అన్ని గ్రామాలలో పూర్తి అయ్యేలా Dyso లు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్మిస్తున్న క్రీడా మైదానాలు సత్వరం పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న అన్ని ప్రధాన క్రీడా మైదానాలలో మైనర్ రిపేర్లను వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం కప్పు నిర్వాణపై త్వరలో ఉద్యోగ సంఘాలతో, క్రీడా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేసేలా తెలంగాణ సాంస్కృతి, క్రీడల ఉత్సవాలను నిర్వహించేలా అందుకు తగిన కార్యచరణను రూపొందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, దీపక్, చంద్రారెడ్డి, డాక్టర్ హరి కృష్ణ, 33 జిల్లాల కు చెందిన DYSO లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News