IND vs SL : బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది. ఇక స్వదేశంలో సిరీస్‌లకు టీమ్ఇండియా సమాయత్తం అవుతోంది. కొత్త సంవత్సరంలో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటలో లంక జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. జనవరి 3 నుంచి టీ20 సిరీస్, జనవరి 10 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. అయితే.. ఇప్పటి వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఈ సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించలేదు.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో మూడో వన్డేతో పాటు టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. రోహిత్ గాయం నయమైందా..? లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో శ్రీలంకతో సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడా..? లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కెప్టెన్ రోహిత్ దూరం అయితే.. ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్ అందుకోవాల్సి ఉంది.
జనవరిలో తన ప్రియురాలు అతియా శెట్టి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు రాహుల్. ఈ నేపథ్యంలో లంక సిరీస్‌కు తాను అందుబాటులో ఉండనని ఇప్పటికే బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. ఒకవేళ అతడు అందుబాటులో ఉన్నప్పటికీ అతడిపై వేటు వేయాలని బీసీసీఐ బావిస్తోందట. టీ20 ప్రపంచకప్ నుంచి రాహుల్ ఘోరంగా విఫలం అవుతుండడమే అందుకు కారణం.
దీంతో లంకతో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యను ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. టీమ్ఇండియా మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ చేసిన పని ఇప్పుడు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇండియా, లంక సిరీస్‌ను ప్రమోట్ చేసేందుకు ఓ ప్రొమోను రూపొందించింది స్టార్‌స్పోర్ట్స్. “కొత్త ఏడాదిలో లంకతో సిరీస్‌కు ఆడేందుకు హార్ధిక్ సిద్ధం అవుతున్నాడు. కొత్త టీమ్ఇండియా యాక్షన్‌ను చూసేందుకు సిద్దం అవ్వండి” అని స్టార్‌స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు కొత్త కెప్టెన్ హార్థిక్ పాండ్యనేనంటూ కామెంట్లు చేస్తున్నారు.