Sunday, October 6, 2024
HomeఆటENG vs PAK : ఇప్ప‌టికైనా కోహ్లీతో పోల్చ‌డం ఆపండి.. బాబ‌ర్ ఓ జీరో :...

ENG vs PAK : ఇప్ప‌టికైనా కోహ్లీతో పోల్చ‌డం ఆపండి.. బాబ‌ర్ ఓ జీరో : డానిష్ క‌నేరియా

ENG vs PAK : స్వ‌దేశంలో పాకిస్తాన్ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌ట్టో అంద‌రికీ తెలిసిందే. అలాంటిది ఇంగ్లాండ్ జ‌ట్టు ఏకంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చ‌రిత్ర సృష్టించింది. ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్‌పై మాజీల‌తో పాటు అభిమానులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. మాజీ ఆట‌గాడు డానిష్ క‌నేరియా ఓ అడుగుముందుకు వేసి బాబ‌ర్ అజామ్ కు కెప్టెన్‌గా ఉండే అర్హ‌త లేద‌న్నాడు. అత‌డొ గుండు సున్నా అని అని అభివ‌ర్ణించాడు. ఇప్ప‌టికైనా విరాట్ కోహ్లీతో బాబ‌ర్‌ను పోల్చ‌డం ఆపేయాల‌ని కోరాడు.

- Advertisement -

‘విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ లు అగ్ర‌శేణి ఆట‌గాళ్లు. అలాంటి ఆట‌గాళ్లు పాక్ జ‌ట్టులో ఒక్క‌రంటే ఒక్క‌రు లేరు. పాక్ ఆట‌గాళ్లు మైక్ ముందు మాట్లాడాలి అంటే హీరోల్లా డైలాగులు వేస్తారు. అదే మైదానంలో ఫ‌లితాలు చూపించ‌మంటే మాత్రం క‌ళ్లు తేలేస్తారు. ఇక కెప్టెన్‌గా బాబ‌ర్ పెద్ద గుండుసున్నా. జ‌ట్టును న‌డిపించే అర్హ‌త అత‌డికి లేదు. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో జ‌ట్టును ముందుండి న‌డిపించే సామ‌ర్థ్యం, నాయ‌క‌త్వ ప్ర‌తిభ అత‌డికి లేవు’. అని క‌నేరియా బాబ‌ర్‌పై మండిప‌డ్డాడు. బెన్‌స్టోక్స్, బ్రెండన్ మెకల్లమ్ వంటి వాళ్ల‌ను చూసి కెప్టెన్సీ ఎలా చేయాలో నేర్చుకోవాల్సింది. క‌నీసం ఇగోను ప‌క్క‌న పెట్టి టెస్టు సిరీస్‌కు ఎంపికైనా స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌ను అయినా అడ‌గాల్సిందని అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఇదిలా ఉంటే బాబ‌ర్ అజామ్ ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో స్వ‌దేశంలో వ‌రుస‌గా నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఓడిన మొద‌టి పాకిస్తాన్ కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా చేతిలో 1-0తో పాక్ టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు డ్రా గా ముగియ‌గా ఆఖ‌రి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 115 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు ఇంగ్లాడ్ 3-0తో వైట్ వాష్ చేసి సిరీస్ ను సొంతం చేసుకుంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News