Strict restrictions in Bengaluru due to IPL Final Match: యావత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూరు పోలీసులు నగరవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. గతేడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు ఛాంపియన్‌గా నిలవగా.. వరుసగా రెండోసారి కప్పు కొట్టేందుకు ఆర్సీబీ ఉత్సాహంతో ఉంది. అయితే, గతేడాది ఆర్బీసీ విజయం అనంతరం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంబరాల్లో తొక్కిసలాటతో కొంతమంది కొహ్లీ అభిమానులు దుర్మరణం పాలయ్యరు. ఈ ఘటనలు పునరావృత్తం కాకుండా బెంగళూరు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆర్సీబీ మరోసారి టైటిల్ గెలిచినా.. ఒకవేళ ఓడిపోయినా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అభిమానులకు పలు కఠిన ఆంక్షలు విధించారు.
Also Read: PM Modi: “ఎండలు మండిపోతున్నాయి.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి!”
బెంగళూరు పోలీసుల హెచ్చరిక..
వేడుకల కోసం బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకూడదు.
2. ముందస్తు అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయకూడదు.
3. మాల్స్, పబ్స్ వంటి వ్యాపార సంస్థలు సాధారణ ప్రజలకు కన్పించేలా స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదు.
4. మ్యాచ్ ముగిసిన తర్వాత రోడ్లపై బైక్‌లతో స్టంట్లు చేయడం, అనవసరంగా హారన్లు కొట్టడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, టపాసులు కాల్చడం పూర్తిగా నిషేధం.
5. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించేది లేదు.
6. మ్యాచ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, పుకార్లు వ్యాప్తి చేయడం వంటివి చేయకూడదు.

