Sunday, October 6, 2024
HomeఆటStuart Broad : పెళ్లికాకుండానే తండ్రైన క్రికెట‌ర్‌

Stuart Broad : పెళ్లికాకుండానే తండ్రైన క్రికెట‌ర్‌

Stuart Broad : ఇటీవ‌ల కాలంలో పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయిన సెల‌బ్రెటీలు చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఇంగ్లాండ్ స్టార్ బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ కూడా చేరిపోయాడు. అత‌డికి కాబోయే భార్య మోలీ కింగ్ ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. అంతేకాకుండా బ్రాడ్‌, మోలీ లు తమ కూతురితో దిగిన ఫోటోలను ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. త‌మ గారాల ప‌ట్టికి ‘అన్నాబెల్లా బ్రాడ్’ అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. స్టువ‌ర్ట్ బ్రాడ్‌, మెలీ కింగ్ కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు. గ‌తేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. త్వ‌ర‌లోనే వీరు పెళ్లి చేసుకోనున్నారు.

- Advertisement -

స్టువ‌ర్ట్ బ్రాడ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇత‌డు ఇండియ‌న్‌ ఫ్యాన్స్‌కు సుప‌రిచితుడే. 2007లో యువీ విధ్వంసానికి బ‌లైయ్యాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో స్టువ‌ర్ట్ బ్రాడ్ వేసిన 19 ఓవ‌ర్‌లోని ఆరు బంతుల‌ను ఆరు సిక్స‌ర్లగా మ‌లిచాడు యువ‌రాజ్ సింగ్. అప్ప‌టి నుంచి భార‌త అభిమానుల‌కు బ్రాడ్ అంటే కొంచెం సానుభూతి. ప్ర‌స్తుతం టెస్టుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన బ్రాడ్‌, త్వ‌ర‌లో పాకిస్తాన్‌తో ప్రారంభ‌మ‌య్యే టెస్ట్‌కు సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News