HomeTop StoriesCSK vs SRH: ప్లే ఆఫ్స్‌కి సన్‌రైజర్స్‌.. సీఎస్‌కేపై ఘన విజయం

CSK vs SRH: ప్లే ఆఫ్స్‌కి సన్‌రైజర్స్‌.. సీఎస్‌కేపై ఘన విజయం

CSK vs SRH IPL 2026: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్స్‌కి దూసుకెళ్లింది. పటిష్టమైన బౌలింగ్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఒత్తిడిలో పడేసింది. ఇషాన్‌ కిషన్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మూడు కీలక వికెట్లను పడగొట్టి 200 స్కోరును కట్టడి చేయడంలో సఫలమయ్యాడు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/ap-district-news/amaravati/cm-chandrababu-review-on-irrigation-projects/

టాస్‌ గెలిచి సీఎస్‌కే బ్యాటింగ్‌కి దిగగా.. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. సంజూ శాంసన్‌(13 బంతుల్లో 27 పరుగులు) బౌండరీలతో చెలరేగే సమయంలో కమిన్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఉర్విల్‌ పటేల్‌(13) సైతం నిరాశపరిచాడు. ఇక కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(15 బంతుల్లో 21 పరుగులు) సైతం త్వరగానే ఔట్‌ అవ్వడంతో జట్టు ఒత్తిడిలో పడింది. వరుసగా 4 వికెట్లు కోల్పోవడంతో నిరాశలో ఉన్న సీఎస్‌కేకి కార్తీక్‌ శర్మ 32(19), డెవాల్డ్‌ బ్రెవిస్‌ 44(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్‌ దూబే 26(23) కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు, సాకిబ్ హుస్సేన్ 2 వికెట్లు, ఎషాన్ మలింగ, ప్రఫుల్ హింగే తలో వికెట్ తీశారు.

Also Read: https://teluguprabha.net/national-news/pm-narendra-modi-receives-highest-award-from-king-of-norway/

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి సైతం ఆరంభంలో కష్టాలు తప్పలేదు. డ్యాషింగ్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(6) నిరాశపరిచాడు. అభిషేక్‌ శర్మ 26(21 బంతుల్లో) 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక హెన్రిచ్‌ క్లాసెన్‌ 47(26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తో తన మార్కు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరి వికెట్లు కోల్పోయాక గెలుపు అంచనాలు తారుమారు కాగా.. ఇషాన్‌ కిషన్‌ 70(47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. డెత్‌ ఓవర్లలో సలీల్‌ అరోరా (10), స్మరన్‌(5) కృషితో 6 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్‌ చౌదరి 2 వికెట్లు, అన్షుల్‌ కాంబోజ్‌, నూర్‌ అహ్మద్‌, అకీల్ హుసేన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News