ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) టైటిల్ వేట మొదలు పెట్టింది. ఐపీఎల్ 17వ సీజన్ లో రన్నరప్ గా నిలిచిన SRH.. ఈ సారి ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో టోర్నీలో అడుగు పెట్టబోతుంది. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి పోరులో రాజస్తాన్ రాయల్స్ తో తలపడనుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
RR ఆటగాడు సంజూ శామ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా కొనసాగనున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాదుకి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆనందంగా కనిపించాడు. సన్ రైజర్స్ తరఫున మళ్లీ ఆడటంపై సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమీలు సన్ రైజర్స్ తరఫున మొదటి సారి ఆడనున్నారు. ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ ఆడే మొదటి మూడు మ్యాచ్ లకు రియాన్ పరాగ్ కెప్టెన్ గా ఉంటాడు. రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ ఫిట్ నెస్ సమస్యల కారణంగా మొదటి మూడు మ్యాచ్ ల్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడనున్నాడు.
గత సీజన్ లో రాణించిన రియాన్ పరాగ్ టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా జట్టుకు దూరమైన రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసి మళ్లీ టీమిండియాకు ఎంపికవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. అందివచ్చిన కెప్టెన్సీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కెప్టెన్ గా కూడా మెరుగ్గా రాణించాలని భావిస్తున్నాడు.
తుది జట్లు:
సన్ రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్, అభినవ్ మనోహర్, షమీ, హర్షల్ పటేల్, సిమ్రన్ జిత్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్స్: జంపా, ముల్దార్, ఉనాద్కట్
రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్ మైర్, శుభం దూబే, నితీశ్ రాణా, ఆర్చర్, తీక్షణ, దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫరూఖీ. ఇంపాక్ట్ ప్లేయర్: సంజు శాంసన్