Saturday, April 19, 2025
HomeఆటIPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఓటమి.. సొంతగడ్డపై ముంబై విజయం..!

IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఓటమి.. సొంతగడ్డపై ముంబై విజయం..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఓటమి ఎదురైంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ ఓటమి చవిచూసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు రోహిత్ శర్మ (26), రికెల్టన్ (31) మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన విల్ జాక్స్ 36 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా (21) చివర్లో చక్కటి ఇన్నింగ్స్ ఆడి, జట్టు విజయానికి దోహదపడ్డాడు. తిలక్ వర్మ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా ముంబై జట్టు 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ముంబై ఖాతాలో 6 పాయింట్లు చేరాయి.

- Advertisement -

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. వాంఖడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. తొలి 15 ఓవర్లలో పెద్దగా పరుగులు రాకపోయినా, చివరి 5 ఓవర్లలో 57 పరుగులు రావడంతో స్కోరు కొంత మెరుగైంది. ముంబై బౌలింగ్‌లో విల్ జాక్స్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇవ్వడంతో పాటు 2 కీలక వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా (1 వికెట్), ట్రెంట్ బౌల్ట్ (1 వికెట్) కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

ఈ విజయంతో నాలుగు ఆరు పాయింట్లతో ముంబై ఇండియన్స్ ఏడో స్థానానికి చేరుకోగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. 300కి పైగా స్కోరు లక్ష్యంగా పెట్టుకున్న సన్ రైజర్స్ జట్టు.. ముంబై బౌలింగ్‌కు తలవంచింది. ఏ బ్యాటర్ సరిగ్గా ఆడక పోవడంతో.. ముంబై సులభ విజయం నమోదు చేసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News