HomeఆటIPL: ఐపీఎల్ అంటేనే బిజినెస్.. ముత్తయ్య మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు!

IPL: ఐపీఎల్ అంటేనే బిజినెస్.. ముత్తయ్య మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు!

Muttiah Muralitharan: ఐపీఎల్(IPL)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ అనేది ఇప్పుడు కేవలం క్రికెట్ అభివృద్ధి కోసం జరిగే టోర్నీ మాత్రమే కాదని, అదొక భారీ వ్యాపారమని (Big Business) ఆయన విశ్లేషించారు.

- Advertisement -

ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బౌలర్ల బలి!: ప్రస్తుత సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ 200లకు పైగా స్కోర్లు నమోదవుతుండటంపై మురళీధరన్ స్పందిస్తూ.. ఇందులో బౌలర్ల తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఐపీఎల్ స్ట్రక్చర్ మరియు పిచ్‌ల రూపకల్పనే బౌలర్లకు ప్రతికూలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాటర్లకు అనుకూలించే పిచ్‌లు, చిన్న బౌండరీల వల్లే భారీ స్కోర్లు సాధ్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

వ్యాపార కోణం: “ఐపీఎల్ అనేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూపొందించబడింది. ఒకవేళ బౌలర్లకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేస్తే.. అభిమానులకు మ్యాచ్ బోర్ కొడుతుంది. సిక్సర్లు, ఫోర్లు లేకపోతే ప్రేక్షకులు రారు. తద్వారా స్పాన్సర్లను కోల్పోయే ప్రమాదం ఉంది” అని మురళీ సంచలన నిజాలను బయటపెట్టారు. మురళీధరన్ అన్నట్లుగానే ఈ సీజన్ గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన 40 మ్యాచ్‌ల్లో ఏకంగా 31 మ్యాచ్‌ల్లో జట్లు 200 కంటే ఎక్కువ స్కోరు చేయడం గమనార్హం. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అలవోకగా ఛేదించి చరిత్ర సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News