Tuesday, March 25, 2025
HomeఆటIPL 2025: ఆరెంజ్ ఆర్మీ వైల్డ్ ఫైర్.. ఇదేం ఉతుకుడురా స్వామి..!

IPL 2025: ఆరెంజ్ ఆర్మీ వైల్డ్ ఫైర్.. ఇదేం ఉతుకుడురా స్వామి..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ వైల్డ్ ఫైర్ ఆట రుచి చూపించింది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన SRH 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 286 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ (106) సెంచరీతో రెచ్చిపోయాడు.

- Advertisement -

ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరును సాధించింది. ట్రావిస్ హెడ్ (67) మెరుపులు మెరిపించాడు. హెన్రిచ్ క్లాసెన్ (34) వేగంగా ఆడాడు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును సన్ రైజర్స్ నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో 287 పరుగులు అత్యధిక టీమ్ స్కోరు ఇది కూడా సన్ రైజర్సే నమోదు చేసింది.

ఈ మ్యాచ్ లో SRH కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (24), ట్రావిస్ హెడ్ లు మెరుపు ఆరంభం ఇచ్చారు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీలు బాదారు. అయితే అభిషేక్ శర్మ అవుటయ్యాక వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ధాటిగానే తన ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు. ఫలితంగా పవర్ ప్లేలో సన్ రైజర్స్ హైదరాబాద్ 94 పరుగులు చేసింది. హెడ్ క్రీజులో ఉన్నంత వరకు ఒక మాదిరిగా ఆడిన ఇషాన్ కిషన్.. అతడు అవుటయ్యాక రెచ్చిపోయాడు.

నితీశ్ రెడ్డి (30)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో క్లాసెన్ కూడా మెరుపులు మెరిపించాడు. క్లాసెన్ అవుటయ్యాక.. వరుసగా రెండు సిక్సర్లు.. డబుల్ తీసి ఇషాన్ కిషన్ సెంచరీ సాధించాడు. దీంతో రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ ఉంచారు. గత సీజన్ లో ఎక్కడైతే వదిలారో.. SRH అ క్కడి నుంచే ప్రారంభించినట్లు కనిపిస్తోంది. మరి ఈ స్టోర్ ని ఎలా చేజ్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News