Tuesday, March 25, 2025
Homeఆటసన్‌రైజర్స్ హైదరాబాద్ కు అదిరే ఆరంభం.. రాజస్థాన్‌పై ఘనవిజయం..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ కు అదిరే ఆరంభం.. రాజస్థాన్‌పై ఘనవిజయం..!

ఐపీఎల్ 2025 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) శుభారంభం చేసింది. గత సీజన్‌లో ప్రదర్శించిన దూకుడు అదే ఉధృతితో ఐపీఎల్ 18వ సీజన్‌లోనూ కొనసాగుతోంది. ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో SRH 44 పరుగుల తేడాతో గెలిచింది. 287 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (70) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ సంజూ సామ్సన్ (66) పోరాడాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతవరకు రాజస్థాన్ పోటీగా కనిపించినా, అవుటైన తర్వాత జట్టు ఇన్నింగ్స్ కుదేలైంది. చివర్లో హెట్‌మైర్ (42), శుభం దూబే (34) మెరుపులు మెరిపించినా, విజయానికి దూరమయ్యారు. హర్షల్ పటేల్, సిమ్రన్ జిత్ సింగ్‌లకు చెరో రెండు వికెట్లు లభించాయి.

- Advertisement -

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన SRH దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 286 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ (106) సెంచరీతో రెచ్చిపోయాడు. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (24), ట్రావిస్ హెడ్ (67) లు మెరుపు ఆరంభం ఇచ్చారు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీలు బాదారు. అయితే అభిషేక్ శర్మ అవుటయ్యాక వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ధాటిగానే తన ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు.

ఫలితంగా పవర్ ప్లేలో సన్ రైజర్స్ హైదరాబాద్ 94 పరుగులు చేసింది. హెడ్ క్రీజులో ఉన్నంత వరకు ఒక మాదిరిగా ఆడిన ఇషాన్ కిషన్.. అతడు అవుటయ్యాక రెచ్చిపోయాడు. నితీశ్ రెడ్డి (30)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో క్లాసెన్ కూడా మెరుపులు మెరిపించాడు. క్లాసెన్ అవుటయ్యాక.. వరుసగా రెండు సిక్సర్లు.. డబుల్ తీసి ఇషాన్ కిషన్ సెంచరీ సాధించాడు. దీంతో రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ ఉంచారు. ఇక ఈ ఘన విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో శక్తిమంతమైన జట్టుగా నిలిచిందని మరోసారి నిరూపించుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News