Suryakumar Yadav: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర తరంగా మారాయి. ఇలాంటి సమయంలో ఆసియా కప్ లో భాగంగా భారత్- పాక్ మధ్య మ్యాచులు జరిగాయి. అయితే, పాక్ తో మ్యాచ్ లు బహిష్కరించాలనే నడుమ మ్యాచులు జరిగాయి. ఆసియా కప్ (Asia Cup 2025)లో భాగంగా పాకిస్థాన్‌ను తొలి మ్యాచ్‌లో ఓడించిన తర్వాత ఆ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నట్లు టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించాడు. ఈ వ్యవహారంలో అతడికి ఐసీసీ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. రిచీ రిచర్డ్సన్ ఆధ్వర్యంలో ఐసీసీ నిర్వహించిన విచారణకు బీసీసీఐ ప్రతినిధులతో కలిసి సూర్యకుమార్ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి జరిమానా లేదా డీమెరిట్ పాయింట్ విధించే అవకాశం ఉందని పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
సూర్యకుమార్ ఏమన్నాడంటే?
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ (Pakistan)తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలనే డిమాండ్ల నడుమ తొలి మ్యాచ్ జరిగింది. టీమ్‌ఇండియా ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. దాయాది జట్టు నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సందర్భంగా, మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో సూర్యకుమార్ షేక్ హ్యాండ్ చేయలేదు. మ్యాచ్ పూర్తయిన తర్వాత సూర్యకమార్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. ‘పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళాలన్నింటికీ ఈ విజయాన్ని అంకితం చేయాలనుకుంటున్నాం. మనందరికీ వారు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా వారి ముఖాల్లో చిరునవ్వు ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాం’’ అని సూర్యకుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఐసీసీ.. అతడిపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.
Read Also: Bigg Boss Update: నిఖిల్ ఫ్యాన్స్ లో టెన్షన్.. కావ్య వచ్చి ఏం చెప్తుందయ్యో..!
పాక్ ప్లేయర్లపై..
ఆసియా కప్ సూపర్ -4 మ్యాచులో రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శించిన పాకిస్థాన్ ఆటగాళ్లపై భారత క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఈవిషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ-మెయిల్ రూపంలో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. పాక్ ప్లేయర్లు హారిస్ రవూఫ్, ఫర్హాన్ నుంచి లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వారు ఇవ్వనిపక్షంలో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఎదుట వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది.. భారత్‌తో మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ‘గన్’షాట్ చూపిస్తూ హావభావాలు ప్రదర్శించాడు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చేష్టలకు పాల్పడటం విమర్శలకు దారితీసింది. తన సెలబ్రేషన్స్‌ను ఫర్హాన్ సమర్థించుకొనేందుకు ప్రయత్నించాడు. అంతేకాక, భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో వాగ్వాదానికీ దిగాడు. పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీ తన సోషల్ మీడియా ఖాతాలో క్రిస్టియానో రొనాల్డో చేసిన ‘ఫ్లైట్’ హావభావాలను పోస్టు చేశాడు. రొనాల్డో వేరే అర్థం వచ్చేలా చేశాడని.. మీరు మాత్రం భారత్‌పై ఆక్రోశం వెళ్లగక్కారని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Womens World Cup: వారంలోగా వన్డే ప్రపంచకప్.. భారత జట్టుకు బిగ్ షాక్..!


