Friday, September 20, 2024
HomeఆటSuryapeta: చీఫ్ మినిస్టర్ కప్-2023 మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

Suryapeta: చీఫ్ మినిస్టర్ కప్-2023 మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం బీసీ గురుకుల పాఠశాలలో చీఫ్ మినిస్టర్ కప్ 2023 మండల స్థాయి క్రీడల పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ లక్కుమల్ల జ్యోతి బిక్షం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్ కప్ పోటీలు విజయవంతం చేయాలని, పోటీదారులు తమ నైపుణ్యాన్ని పరీక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు, జడ్పిటిసి రాపోలు నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు పల్లె పంగు నాగరాజు, తాటికొండ అమృతారెడ్డి, వాడపల్లి రమణ నగేష్, ఎంపీటీసీ లు మండల రాజేష్, నందిపాటి నాగవేణి గురవయ్య, పిఎసిఎస్ చైర్మన్లు అనంత శ్రీనివాస్ గౌడ్, శాఖమూరి శ్రీకాంత్, మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్స్, ఎంపీడీవో శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్ కుమార్, ఎంపీఓ విజయ కుమారి, నాయబ్ తహశీల్దార్ స్రవంతి, మేనేజర్ అశోక్ రెడ్డి, మండల పరిషత్, రెవెన్యూ మునిసిపల్ సిబ్బంది, పిడిలు, పిఇటిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News