ICC T20 WC 2026 IND vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్- 8 పోరులో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య రసవత్తరంగా సాగిన పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేన.. ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో భారత జట్టు సెమీస్‌కు చేరుకుంది.
Also Read: https://teluguprabha.net/international-news/trump-says-he-killed-48-top-iranian-leaders-at-once/
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో విండీస్ జట్టుపై భారత జట్టు ఉత్కంఠ విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. ఇక సెమీ ఫైనల్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో మార్చి 5న వాంఖడే స్టేడియంలో భారత్ తలపడనుంది. కాగా, తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టుతో సౌతాఫ్రికా టీం పోటీ పడనుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ (40), జాసన్ హోల్డర్ అజేయంగా 37 పరుగులు చేసి భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత బౌలర్లు బుమ్రా 2 వికెట్లు, వరుణ్, హార్దిక్ తలో వికెట్ తీశారు.
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకి విజయాన్ని అందించడంలో సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ దోహదపడ్డాయి. అయితే తొలుత ఆరంభంలోనే టీమిండియాకి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. తిలక్ వర్మ 15 బంతుల్లో 27 పరుగులు చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 18 పరుగులు జోడించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్ అజేయంగా 50 బంతుల్లో 97 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నాలుగు సిక్సర్లు, 12 ఫోర్లతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ 19.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

