Saturday, March 14, 2026
HomeTop StoriesIND vs ZIM: సెమీస్‌ ఆశలు సజీవం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం

IND vs ZIM: సెమీస్‌ ఆశలు సజీవం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం

T20 WC IND vs ZIM: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్‌ ఆశలను సజీవం చేసింది. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.. భారత బౌలర్ల ధాటికి 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బెన్నెట్‌ అర్ధ సెంచరీ వృథాగా మారింది. 

- Advertisement -

సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్​లో టీమిండియా అదరగొట్టింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 257 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులే చేసి ఓడింది. 

Also Read: https://teluguprabha.net/telangana/education-commission-key-recommendations-on-teachers-promotions/

కాగా, బ్రియాన్ బెన్నెట్ (97* పరుగులు) భారీ ఇన్నింగ్స్‌ చేయగా.. కెప్టెన్ సికందర్ రజా (31) ఫర్వాలేదనిపించాడు  భారత బౌలర్లలో అర్షదీప్ 3, వరణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 1 వికెట్ తీసి జట్టుకి విజయాన్ని అందించారు. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా.. ఆత్మ విశ్వాసంతో పోరాడిన జింబాబ్వే  ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ అద్భుతంగా పోరాడాడు. 

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. కాగా, ఇప్పటివరకూ జరిగిన టీ20 పొట్టి కప్‌ల్లో టీమిండియాకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్ శర్మ (55), హార్దిక్ పాండ్య (50*), తిలక్ వర్మ (44), ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33) పరుగులతో చెలరేగారు. ఇక జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎంగరవ, బ్లెస్సింగ్స్ ముజర్బాని, మపోస, సికందర్ రజా తలో 1 వికెట్ తీశారు.

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-suggestions-to-group-1-and-2-new-employees/

ఇక, తాజా మ్యాచ్ ఫలితంతో గ్రూప్- 1లో సౌతాఫ్రికా సెమీస్​కు అర్హత సాధించగా.. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉన్నాయి. సూపర్ 8లో ఇప్పటిదాకా రెండు మ్యాచ్​ల్లో టీమిండియా ఒక విజయం సాధించి 2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అటు సూపర్ 8లో వరుసగా రెండు ఓటములతో జింబాబ్వే రేసు నుంచి తప్పుకొంది. తదుపరి మ్యాచ్‌ మార్చి 1న భారత్​, వెస్టిండీస్​ పోరు ఉండనుంది. సెమీస్​కు అర్హత సాధించాలంటే ఇందులోనూ టీమిండియా తప్పక గెలవాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News