Saturday, November 15, 2025
HomeఆటTamim Iqbal: ఆసుపత్రి నుంచి బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్

Tamim Iqbal: ఆసుపత్రి నుంచి బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్

బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. మార్చి 24న ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఆడుతుండగా ఛాతీలో నొప్పిరావ‌డంతో మైదానంలోనే కుప్పకూలాడు. మైదానంలో ఫస్ట్ ఎయిడ్ చికత్స తర్వాత హెలికాఫ్టర్‌లో ఢాకాకు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే హెలిప్యాడ్‌ వద్దకు తీసుకెళ్తున్న స‌మ‌యంలో అత‌డికి నొప్పి ఎక్కువవడంతో సమీప ఆస్పత్రికి త‌ర‌లించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు తమీమ్‌కు ఆంజియోప్లాస్టీ నిర్వహించారు.

- Advertisement -

చికిత్స అనంతరం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకోవడంతో తమీమ్ అభిమానులు, కుటుంసభ్యులు ఊపిరీ పీల్చుకున్నారు. కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్.. ప్రస్తుతం టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు. బంగ్లా జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad