TATA Motors Gifts Women’s World Cup Winning Team: భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయానికి గుర్తుగా, దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్ సంచలన ప్రకటన చేసింది. గత వారం దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియాలోని ప్రతి సభ్యురాలికి త్వరలో మార్కెట్‌లోకి రానున్న టాటా సియెర్రా (Tata Sierra) ఎస్‌యూవీ మొదటి లాట్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఒక్కొక్కరికీ టాప్-ఎండ్ మోడల్
టీమ్ ఇండియా ప్రదర్శించిన అసాధారణ ప్రతిభకు ప్రశంసగా, టాటా మోటార్స్ ఈ ప్రత్యేకమైన బహుమతిని ప్రకటించింది. జట్టులోని ప్రతి క్రీడాకారిణికి ఈ సియెర్రా ఎస్‌యూవీ టాప్-ఎండ్ మోడల్ లభించనుంది. 90వ దశకంలో ‘లైఫ్ స్టైల్ వాహనం’గా ప్రసిద్ధి చెందిన పాత సియెర్రాను ఆధునిక హంగులతో, సరికొత్త డిజైన్‌లో తీసుకొస్తున్నారు.
Legend Meets Legends.
Celebrating the Indian Women’s Cricket Team and their legendary ICC Women’s World Cup performance, Tata Motors Passenger Vehicles proudly presents each member of the team with the Tata Sierra — a bold, versatile, and timeless legend.@TataCompanies pic.twitter.com/RxT4viRa9p
— Tata Motors Cars (@TataMotors_Cars) November 5, 2025
టాటా మోటార్స్ ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, “లెజెండ్స్ (Legends) లెజెండ్స్‌ని కలుస్తున్నాయి. ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని వేడుక చేసుకుంటూ, బలమైన, బహుముఖ, శాశ్వతమైన లెజెండ్‌గా నిలిచే టాటా సియెర్రాను జట్టులోని ప్రతి సభ్యురాలికి అందిస్తున్నాము,” అని పేర్కొంది.
ALSO READ: Betting Apps: బెట్టింగ్ యాప్స్ కేసు.. రైనా, ధావన్‌కు బిగ్ షాక్, రూ. 11.14 కోట్ల ఆస్తులు సీజ్
రాష్ట్రపతి, ప్రధానితో సమావేశం
ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా జట్టు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలిసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన జెర్సీని రాష్ట్రపతికి బహుకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, “మీరు చరిత్ర సృష్టించడమే కాకుండా, యువ తరానికి ఆదర్శంగా నిలిచారు. ఈ జట్టు భారతదేశాన్ని ప్రతిబింబిస్తోంది. వివిధ ప్రాంతాలు, వివిధ సామాజిక నేపథ్యాల నుండి వచ్చినా, మీరంతా ఒక్కటే – టీమ్ ఇండియా,” అని ప్రశంసించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి చూపించారు.
దీనికి ముందు, భారత మహిళా జట్టు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి వారి విజయాన్ని పంచుకుంది.


