Asia Cup 2025– Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఫీట్ ను సాధించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ క్రికెటర్ కు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఈ ఘనతకు ఆసియా కప్ వేదిక కాబోతుంది. ఇంతకీ హార్దిక్ బద్దలు కొట్టబోయే రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2025 ఆసియా కప్ సెప్టెంబరు 9 నుంచి 28 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో ఈ సారి ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. మ్యాచులన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా జరగనున్నాయి. ఎనిమిది జట్లు పాల్గొనబోతున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడబోతుంది. దాయాదుల పోరు సెప్టెంబర్ 14న ఉండబోతుంది.
ఆరు వికెట్స్ దూరంలో..
ఆసియా కప్ లో రాణించేందుకు హార్దిక్ పాండ్యా రెడీ అయ్యాడు. ఈ టోర్నీలో ఆరు వికెట్లు తీసి మరో ప్రధాన మైలురాయిని అందుకోబోతున్నాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన తొలి టీమిండియా క్రికెటర్ గా, వరల్డ్ వైడ్ గా మూడో ఆటగాడిగా నిలవబోతున్నాడు.
Also Read: Asia Cup 2025 -ఈసారి జరగబోయే ఆసియా కప్ లో డేంజరస్ స్వ్కాడ్ ఏదో తెలుసా?
పాండ్యా ఇప్పటి వరకు టీమిండియా తరపున 114 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 27.88 సగటుతో 1812 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాట్ తోనే కాదు బంతితో కూడా సత్తా చాటాడు. టీ20ల్లో అతడు 94 వికెట్లు తీశాడు. రేర్ ఫీట్ సాధించడానికి మరో ఆరు వికెట్లు తీస్తే చాలు. హార్దిక్ కంటే ముందు ఈ ఘనతను బంగ్లా మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ ఉన్నారు. పాండ్యా భారత్ తరుపున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో, ఓవరాల్ గా ఐదో స్థానంలో నిలిచాడు.


