Shubman Gill ICC Player of the Month: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అతను ఎంపిక అవ్వడం ఇది నాలుగోసారి. ఈసారి జూలై నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌లతో పాటు గిల్ కూడా ఉన్నాడు. గిల్ నాయకత్వంలోని టీమిండియా ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ లో అద్భుతంగా పోరాడి సిరీస్ ను 2-2తో డ్రాగా ముగించింది. గిల్ కెప్టెన్ గా, ఆటగాడిగా రాణించాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గిల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడు 75.40 యావరేజ్ తో 754 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. గతంలో సన్నీ బాయ్ 732 పరుగులు చేశాడు. 1936-37 యాషెస్ సిరీస్‌లో 810 పరుగుల చేసిన దిగ్గజ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ మాత్రమే గిల్ కంటే ముందున్నాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో గిల్ ప్రధాన పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ(269) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ(161)తో సత్తా చాటాడు. కెప్టెన్ గా ఉంటూ బ్యాటర్ గా రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 430 పరుగులు చేయడంతో.. ఈ ఫీట్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో గ్రాహం గూచ్ 456 పరుగులు చేశాడు. గిల్ ఇప్పటికే మూడు సార్లు ఐసీసీ ఫ్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. జనవరి 2023, సెప్టెంబర్ 2023, ఫిబ్రవరి 2025కు గానూ ఈ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు నాలుగోసారి అందుకోని రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు.
Also Read: Shubhman Gill – చేతినిండా సంపాదనతో పాతికేళ్ల క్రికెటర్..!
మరోవైపు దక్షిణాఫ్రికా ఆల రౌండర్ వియాన్ ముల్డర్ నుంచి గిల్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లో అతను 265.50 సగటుతో 531 రన్స్ చేశాడు. ఇందులో ఒక ట్రిపుల్ సెంచరీ(367) కూడా ఉంది. బౌలర్ గా ఏడు వికెట్లు కూడా తీశాడు. ఇంకో వైపు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్‌తో ఆడిన మూడు టెస్టుల్లో స్టోక్స్ 50.20 సగటుతో 251 పరుగులు చేయడంతోపాటు 12 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లలో ఫ్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరినో వరిస్తుందో చూడాలి.
Also Read:Test Rankings – ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన సిరాజ్ మియా.. జైస్వాల్, జడేజా కూడా!


