Saturday, November 15, 2025
HomeఆటShubman Gill: కెప్టెన్ గిల్ వల్లనే మూడో టెస్టు ఓడిపోయింది..మాజీ క్రికెటర్

Shubman Gill: కెప్టెన్ గిల్ వల్లనే మూడో టెస్టు ఓడిపోయింది..మాజీ క్రికెటర్

- Advertisement -

ఏం జరిగిదంటే?
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న మూడో రోజున చివరి గంటల్లో జాక్ క్రాలీ సమయం వృథా చేశాడు. అయితే దీనిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. క్రాలీని ఉద్దేశించి గిల్ మాట్లాడుతూ.. ‘ధైర్యం చూపించు’ అన్నాడు. ఇదే మాట స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యింది. అయితే ఈ మాట ఇంగ్లాండ్ ఆటగాళ్లలో మరింత పట్టుదలను పెంచింది. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్బుమైన బౌలింగ్‌తో టీమ్ ఇండియాని కట్టడి చేశాడు. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీ.. బర్మింగ్ హామ్ మ్యాచ్‌లో ఒక సెంచరీ, మరో డబుల్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 23 ఏళ్ల రికార్డును గిల్ బద్దలు కొట్టినట్లు అయ్యింది. ఇంగ్లాండ్ జట్టుపై ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 607 రన్స్ చేయగా.. 101.17 యావరేజ్ ఉంది. అయితే మూడో టెస్టులో మాత్రం ఊహించిన స్థాయిలో రాణించలేదు. దీని వల్లనే టీమ్ఇండియా ఓడిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad