ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో బౌలింగ్‌లో టీమిండియా అదరగొట్టింది. ముఖ్యంగా భారత స్పిన్నర్ల దెబ్బకు న్యూజిలాండ్ విలవిల్లాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర, విల్ యంగ్ (15) వేగంగా ఆడారు. ఒక దశలో ఓవర్‌కు 8 పరుగుల రన్‌రేట్‌తో స్కోరు బోర్డును పరుగెత్తించారు. అయితే స్పిన్నర్ల రాకతో కథ మారిపోయింది.
వచ్చీరావడంతోనే విల్ యంగ్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. ఆ వెంటనే కుల్దీప్ యాదవ్ 8 బంతుల తేడాలో ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (11)లను అవుట్ చేశాడు. దాంతో 18 పరుగుల వ్యవధిలో కివీస్ 3 వికెట్లను కోల్పోయింది. కాసేపటికే టామ్ లేథమ్ (14)ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. ఫలితంగా కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా ఎవరూ దూకుడుగా ఆడలేకపోయారు.
న్యూజిలాండ్ ఆటగాళ్లలో డారిల్ మిచెల్ (63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) ఫర్వాలేదనిపించారు. చివర్లో బ్రేస్ వెల్ (55 నాటౌట్) అడపాదడపా పరుగులు సాధించడంతో కివీస్ ఆ మాత్రం పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు చెరో రెండు వికెట్లతో మెరిశారు. రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీలకు చెరో వికెట్ లభించింది. టీమిండియా టాప్ ఆటర్ ఆటగాళ్లు రాణిస్తే.. టైటిల్ సొంతం చేసుకోవచ్చని అభిమానులు అంటున్నారు.