Saturday, February 8, 2025
HomeఆటIND vs ENG : ఇంగ్లండ్ తో రెండో వన్డే.. కోహ్లీ రాకతో మారనున్న టీమిండియా...

IND vs ENG : ఇంగ్లండ్ తో రెండో వన్డే.. కోహ్లీ రాకతో మారనున్న టీమిండియా ప్లేయింగ్ XI..!

స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా.. రెండో మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. ఫిబ్రవరి 9న జరిగే మ్యాచ్ కు టీమిండియా స్టార్ ఆటగాడు.. విరాట్ కోహ్లీ తిరిగి ఫిట్ నెస్ సాధించారు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే రెండో వన్డేలో విరాట్ కోహ్లీ తిరిగి వస్తే, టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఎవరో ఒకరు బయటకు వెళ్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

- Advertisement -

మోకాళ్ళ నొప్పి కారణంగా విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. తొలి వన్డే మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్ చేస్తుండగా.. కోహ్లీకి గాయమైంది. అయితే రెండో వన్డేకు ముందు కోహ్లీ కోలుకున్నాడు.. గాయం నుంచి పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్‌ సితాన్షు కోటక్‌ వెల్లడించారు. రెండో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. కటక్‌ వన్డేకు ముందు కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని పేర్కొన్నారు. కటక్‌లో అతడు ప్రాక్టీస్ కూడా చేశాడని, బాగా ప్రిపేర్‌ అయ్యాడని ఈ సందర్భంగా సితాన్షు కోటక్‌ చెప్పుకొచ్చారు. ఇక కోహ్లీ రాకతో జట్టు నుంచి ఎవర్ని తప్పిస్తారనేది చూడాలి.

తొలి వన్డేలో విరాట్ కోహ్లీ ఆడకపోవడంతో అతడి ప్లేసులో శ్రేయస్ అయ్యర్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతడు మెరుపు హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 36 బంతుల్లోనే 59 రన్స్ చేసి.. భారత్‌ ఈజీగా లక్ష్యాన్ని ఛేదించేలా పునాది వేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతడిని జట్టు నుంచి తప్పించడం కష్టమే. దీంతో నాగ్‌పూర్ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్.. ఈ మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. దీనిపై ఆదివారమే క్లారిటీ రావాలి. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలం అయ్యాడు. దీంతో రోహిత్ పై మాజీలు విమర్శలు చేస్తున్నారు. దీంతో రెండో వన్డేలోనైనా రోహిత్ తిరిగి ఫామ్ లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక ఈ వన్డేలో కూడా గెలిచి.. సిరీస్ ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. సిరీస్ సమం చేసి పోటీ ఇవ్వాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది.

భారత తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్‌ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్‌/ వరుణ్‌ చక్రవర్తి, మహమ్మద్ షమీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News