Sunday, February 8, 2026
HomeఆటKL Rahul: రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం... కేఎల్ రాహుల్ సెంచరీ వృథా

KL Rahul: రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం… కేఎల్ రాహుల్ సెంచరీ వృథా

KL Rahul: రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం… కేఎల్ రాహుల్ సెంచరీ వృథా

- Advertisement -

Team India suffers to defeat in the second ODI: ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిపాలైంది. తన అద్భుతమైన ఆట తీరుతో డారిల్ మిచెల్ 117 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఈ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ జట్టుకు విజయం సునాయాసంగా మారింది. భారత జట్టు నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా న్యూజిలాండ్‌ ఛేదించగలిగింది. న్యూజిలాండ్‌ జట్టు 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోగలిగింది. భారత జట్టులో కేఎల్ రాహుల్ 112 పరుగులతో అజేయ సెంచరీతో చెలరేగినప్పటికీ ఆయన సెంచరీ వృథాగా మారింది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇవాళ (బుధవారం) జరిగిన వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకొని గ్రౌండ్‌లోకి దిగింది. కేఎల్ రాహుల్ శతకం, శుభ్‌మన్ గిల్ (56) అర్ధశతకంతో చెలరేగిపోయారు. అయితే, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (24), విరాట్ కోహ్లీ (23), శ్రేయస్ అయ్యర్ (8) వంటి కీలక బ్యాట్స్‌మెన్లు సైతం విఫలం కావడంతో భారీ స్కోరు చేయలేక భారత జట్టు న్యూజిలాండ్‌ ముందు తేలిపోయింది. ఇక, తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు చెందిన బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీం 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన డారిల్ మిచెల్, విల్ యంగ్‌ (87)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 162 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ఆశలపై నీళ్లు చల్లారు. విల్ యంగ్ ఔటయ్యాక, గ్లెన్ ఫిలిప్స్ 32 రన్స్‌తో మిచెల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం విశేషం. ఈ కారణంతోనే కివీస్ సునాయాసంగా విజయం సాధించగలిగింది. ఈ భారీ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News