ICC Men’s Player Of The Month Award 2025: టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జూలై నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో ప్రపంచ క్రికెట్‌లో నాలుగు సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరియు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ.. చివరకు అవార్డు గిల్ నే వరించింది. జూలై నెలలో గిల్ మూడు టెస్టులు ఆడి..94.50 సగటుతో 567 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ, 2023గానూ జనవరి, సెప్టెంబరులోనూ గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. తాజాగా అందుకున్నది నాలుగోది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈ పురస్కారాన్ని నాలుగు సార్లు అందుకున్న ఏకైక ప్లేయర్ గా గిల్ రికార్డు సృష్టించాడు. మహిళా క్రికెటర్లలో యాష్ గార్డ్నర్ మరియు హేలీ మాథ్యూస్‌ల ఇప్పటికే నాలుగుసార్లు ఈ అవార్డును అందుకున్నారు.
గిల్ రికార్డులు…
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించడంలో గిల్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో 269పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు.. మెుత్తంగా ఆ టెస్టులో 430 పరుగులు చేశాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక పరుగులు. గ్రహం గూచ్ (456) తర్వాత గిల్ సెకండ్ ఫ్లేస్ లో ఉన్నాడు.ఎడ్జ్‌బాస్టన్‌లో అనేక రికార్డులను నెలకొల్పాడు.ఇంగ్లాండ్‌లో టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్‌గా మరియు విరాట్ కోహ్లీ తర్వాత భారతదేశం వెలుపల ఈ ఘనత సాధించిన రెండవ భారత కెప్టెన్‌గా అతను నిలిచాడు.
Also read: India vs England – డిజిటల్ రికార్డులు బద్దలుకొట్టిన భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్!
సునీల్ గవాస్కర్ గతంలో 221 పరుగుల రికార్డును అధిగమించి…ఇంగ్లాండ్‌లో ఒక భారతీయుడు సాధించిన అత్యధిక టెస్ట్ స్కోరుకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాడు. అదేవిధంగా ఆసియా ఖండం వెలుపల విదేశాల్లో అత్యధిక స్కోరు సాధించిన సచిన్ టెండూల్కర్ 21 సంవత్సరాల రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో గిల్ బ్యాటర్ గా, కెప్టెన్ గా జట్టును విజయపథంలో నడిపించాడు. గిల్ ఐదు టెస్ట్‌ల సిరీస్ లో 10 ఇన్నింగ్స్‌లలో 75.40 సగటుతో 754 పరుగులతో చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో రెండవ అత్యధికం.


