Shubman Gill Breaks Kohli Record: టీమిండియా టెస్టు కెప్టెన్ శుభమన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. సెంచరీ మీద సెంచరీలు చేస్తూ దుమ్ము రేపుతున్నాడు. తొలి టెస్టులో తొలి ఇన్సింగ్‌లో 147 పరుగులతో రాణించాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 269 పరుగులతో వీరవిహారం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 161 పరుగులు చేశాడు. దీంతో కేవలం రెండు టెస్టుల్లోనే 585 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
కానీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం 44 బంతుల్లో 16 పరుగులకే ఔట్ అయి నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఓ రికార్డును మాత్రం చేరుకున్నాడు.
ఇంగ్లాండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. 2018లో ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా కోహ్లీ 593 పరుగులు చేశాడు. గిల్ తాజా సిరీస్‌లో 601 పరుగులు సాధించాడు.
ఇంకా మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌తో పాటు చివరి రెండు టెస్టుల్లో బ్యాటింగ్ చేయనుడంటంతో 1000 పరుగుల మైలు రాయిని చేరుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే ఇంగ్లాండ్ వేదికగా 600 పరుగులు సాధించిన తొలి భారత కెప్టెన్‌గానూ గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డ పై ఓ సీరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్లు ఎవరంటే.. శుభమన్ గిల్ ప్రస్తుత సిరీస్‌లో 601* పరుగులు, 2018లో విరాట్ కోహ్లీ 583 పరుగులు, 1990లో మహ్మద్ అజారుద్దీన్ 426 పరుగులు, 2002లో సౌరవ్ గంగూలీ 351 పరుగులు, 2014లో ఎంఎస్ ధోనీ 349 పరుగులతో ముందు వరుసలో ఉన్నారు.
Also Read: రోహిత్ శర్మకు షాక్.. గిల్కి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు..?
ఇక మూడో టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ ఆటగాడు జో రూట్ 104 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టాడు. సిరాజ్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 2, జడేజా ఓ వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 145/3 పరుగులు చేసి 242 పరుగులు వెనుకంజలో ఉంది. ఓపెనర్ కేఎల్ రాహుల్(53), రిషభ్ పంత్(19) పరుగులతో క్రీజులో ఉన్నారు.


